బాల కె దావులూరి, ఎండి

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ

ఆయుష్ హాస్పిటల్ ఏలూరు

Bala K Davuluri, MD

American Board of Neurology

Aayush hospital Eluru


ఫిట్స్ కాని ఫిట్స్

Non-epileptic Seizures

ఫిట్స్ కాని ఫిట్స్: హిస్టీరియా: హిస్టీరికల్ ఫిట్స్, ఫిట్స్ లాగానే ఉంటాయి, కానీ ఎపిలెప్సీ కావు. ఎపిలెప్సీ మందులు పనిచేయవు. ఎపిలెప్సీ గా పొరపాటు పడి రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వటం తరచుగా జరుగుతుంది. పేషెంట్లకు చాలా బాధను కలిగిస్తాయి.సరైన కౌన్సిలింగ్ తో మంచి ఫలితం ఉండవచ్చును. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడవచ్చును.

Hysterical Seizures: Hysterical (Psychogenic Seizures) are non-epileptic seizures that come without any apparent reason. There may or may not be an underlying stress or psychiatric illness. They are often mistaken for epilepsy and given the wrong treatment. Treatment consists of counseling and sometimes management of the underlying psychiatric disorders.

ఫిట్స్ కాని ఫిట్స్: నిద్రలో చేష్టలు: నిద్రలో కొంతమంది కొంతమంది రకరకాల చేష్టలు చేస్తుంటారు. నిద్రలో మాట్లాడటం, నిద్రలో నడవటం, పిల్లలు నిద్రలో లేచి అకారణంగా ఏడవటం జబ్బు లక్షణాలు కాదు. కానీ కలలలో కాళ్ళు, చేతులు ఆడిస్తుంటే, అది కొంచెం సీరియస్ గా తీసుకోవలసిన విషయమే. అది పార్కిన్సన్స్ డిసీజ్ లాంటి జబ్బులు భవిష్యత్తులో రావటానికి సూచన కావచ్చును. మామూలుగా కలలు వచ్చినప్పుడు శరీరం కదలకూడదు.

Events in sleep: Events like sleep walking, sleep talking and night terrors are harmless. Sometimes, people act out their dreams with their arms and legs. The dreams are usually stereotypical like they or their family members are threatened or attacked. The patient may retaliate in sleep by punching or kicking the spouse. This kind of sleep behaviors can be the forerunners of Parkinson's disease. Normal people get paralyzed during dreams and can not act out their dreams.

ఫిట్స్ కాని ఫిట్స్: కళ్ళుతిరిగి పడటం (మూర్ఛ): ఒకోసారి బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. మెదడుకి రక్తం ఎక్కదు. మెదడు తాత్కాలికంగా పనిచేయటం ఆగిపోతుంది. అప్పుడు స్పృహ తప్పి పడిపోవటం జరుగుతుంది. పడిపోగానే, మెదడు పల్లంగా ఉంటుంది కాబట్టి రక్తం సులభంగా ఎక్కుతుంది. మనిషికి స్పృహ వచ్చేస్తుంది. ఇది ఫిట్ కాదు. బ్లడ్ ప్రెషర్ పడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చును. వంట్లో బాగోకపోవటం, ఉపవాసం, మందులు, ఒకోసారి గుండె జబ్బు ఇంకా ఇతర కారణాలు

Fainting spells: Sometimes, blood pressure falls low and then blood can not reach brain. The brain stops working temporarily. The person looses consciousness and falls down. When the person is on the floor, gravity is eliminated. Blood can reach the brain easily and the person wakes up. The fall in blood pressure can be because of several reasons, usually sickness, dehydration, starvation, medications and sometimes heart disease.

ఫిట్స్ కాని ఫిట్స్: పిల్లలు గుక్కతిప్పుకోలేక వచ్చే ఫిట్స్: ఒకోసారి చంటిపిల్లలు ఏడ్చినప్పుడు గుక్కబట్టి నీలిగా మారిపోతారు. ఇది ఫిట్ కాదు. చూడటానికి భయం గొలిపే లాగా ఉన్నా, ప్రమాదమేమీ ఉండదు. వయసు పెరిగిన కొద్దీ తగ్గిపోతుంది. ఒకసారి శరీరంలో ఇనుము లోపం వలన ఇలా జరగవచ్చును.

Breath Holding Spells: Sometimes, babies stop breathing when they cry. They become blue or pale. This is scary to look at but not dangerous. Improves as the babys grow. Sometimes, this can be because of iron deficiency.

సంప్రదించండి / Contact