బాల కె దావులూరి, ఎండి

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ

ఆయుష్ హాస్పిటల్ ఏలూరు

Bala K Davuluri, MD

American Board of Neurology

Aayush Hospital Eluru

నడుము నెప్పి, సయాటికా

Backache, Sciatica

నడుమునెప్పి ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? నడుము నెప్పికి అనేక కారణాలు ఉండవచ్చును. ప్రధానమైనవి డిస్క్ ల లోను, జాయింట్లలోనూ, తేడాలు. డిస్కులు పొడుచుకు రావటం వలనా, జాయింట్లలో వాపులవలనా ఒకోసారి నాడులు (నరాలు) నలుగుతాయి. నరాలు నలిగినప్పుడు నెప్పి కాలులోనికి పొడుస్తుంది. కాలులో కండరాలు బలహీనపపడవచ్చును. నడుము నెప్పి సుఖంగా కూర్చుని, దుర్బలంగా, లావుగా ఉండేవాళ్ళకు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకోసారి కాయకష్టం చేసుకునేవాళ్లకు కూడా వస్తుంది. శరీర తత్త్వం ప్రభావం ఉంటుంది. వయసుతో పాటు నడుమునెప్పి ఉన్నవాళ్ళ శాతం పెరుగుతుంది.

The why and how of backache: There can be many reasons for backache. The most important are the changes in the disks and the joints of the back. Sometimes, these changes cause compression of nerves. When nerves are compressed the pain shoots into the legs. There may weakness in leg muscles. Backache is generally seen in overweight deconditioned people with bad postures, but no one is an exception. It can be seen in hardworking people also. Body constitution plays an important role. The proportion of people with backache increases with age.


నడుమునెప్పి లక్షణాలు: మాములుగా వచ్చే నడుము నెప్పి ప్రభావం కాళ్ళ మీద ఉండదు. ఒకోసారి జాయింట్లలో జబ్బు వలనా, డిస్కులు జారటం వలనా నరాలు నలుగుతాయి. నరాలు నలిగినప్పుడు లక్షణాలు 3 రకాలుగా రావచ్చును.

1. సయాటికా: నెప్పి కాలులోకి పొడుస్తుంది. సాధారణంగా కొన్ని వారాలు లేదా కొద్ది నెలలు ఉండి తగ్గిపోతుంది.

2. స్పైనల్ స్టెనోసిస్. పెద్దవాళ్లకు వస్తుంది. నిలబడినా, నడిచినా, కాళ్ళలోనూ, నడుములోను నెప్పి వస్తుంది. కూర్చుంటే తగ్గిపోతుంది. ముందుకు వంగినా కాస్త తగ్గుతుంది. వాకర్ తో నడవటం వీలవుతుంది.

3. కాడా ఈక్వినా సిండ్రోమ్: నడుమునెప్పి తో పాటు మల మూత్ర విసర్జనల మీద అదుపు తగ్గుతుంది. మర్మాయవాల దగ్గర స్పర్శ తగ్గుతుంది. సకాలంలో వెంటనే ఆపరేషన్ చేస్తే మంచిది.

Backache Symptoms: The usual backache does not radiate down into the legs. Sometimes, there will be compression of the nerves because of disc bulges and arthritic spurs. When the nerves are damaged, there can be 3 types of problems:

  • Sciatica: The pain radiates into the legs. Sometimes there will be weakness in leg or foot muscles.
  • Spinal stenosis: Seen in elderly people. Pain comes on standing walking and is relieved on sitting. Gets better on bending forward. Walker is very useful.
  • Cauda equina syndrome: This causes loss of bladder and bowel control. There may be numbness near the buttock areas. May need emergency surgery.



నడుమునెప్పి చికిత్స: సాధారణంగా నడుమునెప్పి దానంతట అదే తగ్గిపోతుంది. చికిత్స వలన ఇది మరింత సులభమవుతుంది. చికిత్స స్వంతంగా చేసుకోవచ్చును. కదలకుండా పడుకోకూడదు. ఎవరి పనులు వాళ్ళు వీలైనంత వరకు చేసుకోవచ్చును. వ్యాయామం అంటే ఎక్సరసైజులు చెయ్యాలి. నెప్పి ఎక్కువయ్యే పనులు, ఎక్సరసైజులు చెయ్యకూడదు. ఎక్సరసైజులు తక్కువ స్థాయిలో మొదలు పెట్టి క్రమేపీ ఎక్కువ చెయ్యాలి. అవసరాన్ని బట్టి నెప్పి మందులు తాత్కాలికంగా వాడవచ్చును. మందులు నెప్పి తగ్గటానికి మాత్రమే, జబ్బు తగ్గటానికి కాదు. ప్రత్యేకమైన పరికరాలు ఏమీ అక్కరలేదు. ఎక్సరసైజులు చెయ్యటం కష్టంగా ఉంటే ఫిజికల్ తిరపిస్ట్ సహాయం తీసుకోవచ్చును.

Treatment of backache: Backache gets better on its own in majority of cases. Treatment facilitates recovery. Treatment is mainly through exercises. Pain medication may be used temporarily to help exercise. Medication is good only for pain relief, not for healing. Exercises have to be started at a low level and then increased gradually. Avoid activities that make pain significantly worse. physical therapist will help if the patient finds it difficult to exercise. No special equipments are needed.

నడుమునెప్పికి డాక్టర్ ఎప్పుడు అవసరం: నెప్పి ఒకటి రెండు వారాల్లో తగ్గుముఖం పెట్టకపోయినా, జ్వరం, నీరసం లాంటి లక్షణాలు ఉన్నా, పడుకున్నప్పుడు కూడా నెప్పి మెరుగు కాకపోయినా డాక్టర్ కి చూపించుకోవాలి. కాలిలో కండరాలు బలహీనమయ్యి, బలహీనత ఎక్కువైపోతుంటే ఆపరేషన్ అవసరం. మలమూత్ర విసర్జనలమీద అదుపుతగ్గిన వాళ్లకు వెంటనే ఆపరేషన్ కావచ్చును. మిగతా సందర్భాల్లో ఆపరేషన్ చేయించుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఆపరేషన్ వలన నెప్పి వెంటనే తగ్గవచ్చును కానీ దీర్ఘకాలంలో ఆపరేషన్ చేయిచుకొన్నదానికి చేయించుకోని దానికి తేడా ఉండదు. MRI లో డిస్కులు భయంకరంగా ఉన్నాయని ఆపరేషన్ చేయించుకోకూడదు. MRI స్కాన్ చేయించుకోవటం వలన ఎక్కువ సందర్భాల్లో ఉపయోగం ఏమీ ఉండదు.

When to see doctor for backache: Better to see doctor if there are associated symptoms like fever, fatigue, loss of appetite and weight loss and also if the pain does not trend down after 2 weeks. Not getting any relief on laying down is also a matter of concern. Surgery is needed if there is progressive muscle weakness like foot drop in the legs and/or if there is loss of bladder and bowel control. Think carefully before getting surgery done only for pain relief. Research showed that surgery may provide pain relief in the short run but makes no difference in the long. MRI scans do not provide any useful information in most situations but are definitely needed prior to surgery.



సంప్రదించండి / Contact