బాల కె దావులూరి, ఎండి

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ

ఆయుష్ హాస్పిటల్ ఏలూరు

Bala K Davuluri, MD

American Board of Neurology

Aayush Hospital Eluru

డయాబెటిస్

Diabetes

మాములుగా డయాబెటిస్ న్యూరాలజీ జబ్బు కింద లెక్క కాదు. ఐతే స్ట్రోక్,న్యూరోపతి, బుద్ధిమాంద్యం లాంటి అనేక న్యూరాలజీ జబ్బులకి ఇది ప్రధాన కారణం. డయాబెటిస్ ని సరిగా చికిత్స చేయటం వలన న్యూరాలజీ జబ్బులను తగ్గించుకోవచ్చును.

Diabetes is typically not a neurological disease, but it is one of the main causes of a variety of neurological problems including stroke, neuropathy and dementia. Good management of diabetes is part of the neurology care.

డయాబెటిస్ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఏంచెయ్యాలి? డయాబెటిస్ ఉన్నవాళ్లకు, శరీరం ఇన్సులిన్ కి స్పందించటం తగ్గిపోతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ముందు ఎక్కువవుతుంది. తరవాత క్రమేపీ క్షీణిస్తుంది. ఇన్సులిన్ కి స్పందన తగ్గటానికి ప్రధాన కారణాలు శరీర తత్త్వం, కొవ్వు పట్టడం. డయాబెటిస్ వలన అనేక అనర్ధాలు. నిర్లక్ష్యం చేస్తే ఆయుర్దాయం క్షీణిస్తుంది. సరైన చికిత్సకు చక్కగా లోంగే జబ్బు ఇది.

Why and how of diabetes: The primary problem in diabetes is insulin resistance. Insulin production increases initially and then declines gradually. Constitutional predisposition and fat accumulation in body, in varying proportions, are the most importance causes for insulin resistance. Diabetes leads to many problems and reduces life span. It is an eminently treatable condition.


డయాబెటిస్ మందులు: పూర్వం లా కాకుండా ఇప్పుడు మందులు చాలా రకాలు ఉన్నాయి.కొన్ని చౌక. కొన్ని ఖరీదు ఎక్కువ. కొన్నిటివల్ల హైపోగ్లిసెమియా వస్తుంది. కొన్నిటివల్ల రాదు. కొన్ని బరువు తగ్గిస్తాయి, కొన్ని పెంచుతాయి. కొన్ని బలంగా పనిచేస్తాయి. కొన్ని ఒక మోస్తరుగా పనిచేస్తాయి. కొన్ని మందులవలన డయాబెటిస్ తగ్గటమే కాకుండా, ఇతర ప్రయోజనాలు (హార్ట్ ఎటాక్, స్ట్రోక్, బీపీ, మూత్రపిండాల విషయాల్లో) ఉంటాయి. మీ అవసరాలను బట్టి మీకు సరిపడే మందును, ఎంచుకోవచ్చును. ఏ మందయినా మంచి చెడ్డ ఉంటాయి. మందులను చాకచక్యంగా వాడి, చెడ్డ ఏమీ జరగకుండా, అంతా మంచే జరిగేలాగా చేసుకోవాలి. చికిత్సను సాధారణంగా మెట్ఫార్మిన్ తో మొదలు పెడతారు. మందులతో పని జరగకపోయినా, లేదా డయాబెటిస్ మరీ ఎక్కువగా ఉన్నా ఇన్సులిన్ మొదలు పెట్టాలి. మందులతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

Diabetes medications: There are multiple medications for diabetes. Some are cheap and some are expensive, costing up to Rs 1000/- a day. Some have the risk of hypoglycemia and others do not. Some cause weight loss and others cause weight gain. Some are more effective and some are less effective. Some have additional benefits in terms of prevention of heart attacks, strokes and kidney disease. Every medication has pros, cons and some side effects. With the help of your doctor, you have to choose medications that are most appropriate to you. Treatment is generally started with Metformin. Insulin is added when medications fail or when diabetes is severe. Medications are unlikely to help if there are no lifestyle changes.



చాలా మందికి ఎంత జాగ్రత్తగా ఉన్నా జబ్బు ముదురుతుంది. ఇన్సులిన్ మొదలు పెట్టవలసివస్తుంది. ఇన్సులిన్ తో ప్రధానంగా రెండు రిస్కులు. హైపోగ్లిసెమియా రిస్క్, బరువు పెరిగే రిస్క్. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ రిస్కులు ఉండవు.

ఇన్సులిన్ చికిత్స బేసల్ ఇన్సులిన్ తో మొదలు పెట్టాలి. బేసల్ ఇన్సులిన్ 24 గంటలూ శరీరానికి ఇన్సులిన్ని తక్కువస్థాయి సరఫరా చేస్తుంది. బేసల్ ఇన్సులిన్ లో రెండు ముఖ్యమైన రకాలు: గ్లార్జిన్ (ఎక్కువ ఖరీదు), NPH (చౌక). ఇంజక్షన్ రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేసుకోవలసి వస్తుంది.

బేసల్ ఇన్సులిన్ తో జబ్బు అదుపులోకి రాకపోతే బోలస్ ఇన్సులిన్ మొదలు పెట్టాలి. బోలస్ ఇన్సులిన్ తినడానికి ముందు చేసుకోవాలి. కొద్దిసేపే అంటే తిండి అరిగే వరకే పని చేస్తుంది. ఇందులో ఖరీదయిన రకాలు లిస్ప్రో, అస్పర్ట్, గ్లులైసిన్. చౌక రకం రెగ్యులర్ ఇన్సులిన్. ఇంజక్షన్ రోజుకి ఒకటి నుండి 3 సార్లు చేసుకోవలసి వస్తుంది.

జాగ్రత్తగా వాడుకుంటే చౌక ఇన్సులిన్లు ఖరీదయిన ఇన్సులిన్లతో సమానంగా పనిచేస్తాయి.

ఇన్సులిన్ వాడేటప్పుడు ఒక పధ్ధతి ప్రకారంగా గ్లూకోస్ టెస్ట్ చేసుకోవాలి. గ్లూకోస్ లెవెల్ని బట్టి మోతాదులో మార్పులు చేర్పులు చేసుకోవాలి. గ్లూకోస్ టెస్ట్ చేసుకోలేని వాళ్ళు కూడా ఇన్సులిన్ వాడవచ్చును. ఐతే జబ్బుని టైట్ గా అదుపు చెయ్యటం వీలు కాదు. అసలు అదుపు లేనిదానికన్నా ఇది చాలా మేలు.

బేసల్ ఇన్సులిన్ బోలస్ ఇన్సులిన్ కలిపి ఉండే ప్రీమిక్సడ్ ఇన్సులిన్ని చాలా మంది వాడుతున్నారు. ఇది సులభంగా అనిపించుతుంది కానీ రిస్కులు ఎక్కువ. టైట్ కంట్రోల్ వీలు కాదు.

మెట్ఫార్మిన్, కెనాగ్లిఫ్లోజిన్ లాంటి మందులను ఇన్సులిన్ తో పాటు కలిపి వాడవచ్చును.ఇలా చెయ్యటం వలన ఇన్సులిన్ తక్కువ మోతాదులో సరిపెట్టుకోవచ్చును. బరువు కూడా పెరగదు. జిపిజిడ్, గ్లిమిపేరిడ్, పయోగ్లిటాజోన్ లాంటి మందులు ఇన్సులిన్ తో కలిపి వాడటం అంత మంచిది కాదు.

Diabetes advances in spite of good care and many patients will need insulin. Insulin is very effective but has 2 risks, the risk of hypoglycemia and the risk of weight gain. These risks can be avoided with appropriate care.

Insulin treatment is started with basal insulin. Basal insulin provides insulin continuously at a low level. Needs one or two injections per day. Choices include the costly Glargine and the cheap NPH.

When basal insulin fails to give good control, bolus insulin is needed. Bolus insulin is injected before meal. It acts only for a short time, until the meal is digested. Needs one to three injections per day. Choices include the expensive Lispro, Aspart and Glulisine and the cheap regular insulin.

With appropriated extra care, the cheap insulin regimens can be as good as the expensive ones.

Patients using insulin need to test their blood glucose with a regular plan. Insulin dose needs to adjusted according to the blood glucose levels. When blood glucose can not be tested regularly, insulin needs to be used with lower dosing. Good control is not possible. Some control is much better than no control.

Basal and bolus insulins are combined in premixed insulins (70/30). Premixed insulins appear convenient but carry higher risk of hypoglycemia. Can be used only at lower dosing. Best control is not possible.

Insulin can be combined with medications like Metformin and Cangliflozin. With these combinations, the risk of weight gain can be eliminated. The dose of of insulin can be minimized. It is better to avoid medications like Glipizide, Glimeperide and Pioglitazone along with insulin.

సంప్రదించండి / Contact