బాల కె దావులూరి, ఎండి

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ

ఆయుష్ హాస్పిటల్ ఏలూరు

Bala K Davuluri, MD

American Board of Neurology

Aayush Hospital Eluru

మెడ నెప్పి

Neck Pain, Cervical Spondylosis

మెడ నెప్పి కారణాలు, లక్షణాలు: మెడ నెప్పికి అనేక కారణాలు ఉండవచ్చును. ప్రధానమైనవి డిస్క్ ల లోను, జాయింట్లలోనూ, తేడాలు. డిస్కులు పొడుచుకు రావటం వలనా, జాయింట్లలో వాపులవలనా ఒకోసారి నాడులు (నరాలు), వెన్నుపాము నలుగుతాయి. నరాలు నలిగినప్పుడు నెప్పి చేతిలోకి పొడుస్తుంది. చేతిలోని కండరాలు బలహీనపపడవచ్చును. వెన్నుపాము నలిగితే నడక కష్టమవుతుంది. ఒకోసారి నెప్పిలేకుండాకూడా నరాలు, వెన్నుపాము నలగవచ్చును. వ్యాయామం లేకపోవటం లేదా సరైన భంగిమ లో కూర్చోకపోవటం వలన మెడనెప్పి రావచ్చును. ఒకోసారి కాయకష్టం చేసుకునేవాళ్లకు కూడా వస్తుంది. శరీర తత్త్వం ప్రభావం ఉంటుంది. వయసుతో పాటు నడుమునెప్పి ఉన్నవాళ్ళ శాతం పెరుగుతుంది.

The causes and symptoms of neck pain and cervical spondylosis: There can be many reasons for neck pain. The most important are the changes in the disks and the joints of the back. Sometimes, these changes cause compression of nerves. and spinal cord. When nerves are compressed the pain shoots into the arms. There may weakness in arm muscles. When the spinal cord is compressed walking may become difficult. Sometimes, there can be compression of the nerves and/or spinal cord without any pain. Neck pain may be seen in deconditioned people with bad postures, but no one is an exception. It can be seen in hardworking people also. Body constitution plays an important role. The proportion of people with neck pain increases with age.

మెడనెప్పి చికిత్స: సాధారణంగా మెడ నెప్పి దానంతట అదే తగ్గిపోతుంది. చికిత్స వలన ఇది మరింత సులభమవుతుంది. చికిత్స స్వంతంగా చేసుకోవచ్చును. కదలకుండా పడుకోకూడదు. ఎవరి పనులు వాళ్ళు వీలైనంత వరకు చేసుకోవచ్చును. వ్యాయామం అంటే ఎక్సరసైజులు చెయ్యాలి. నెప్పి ఎక్కువయ్యే పనులు, ఎక్సరసైజులు చెయ్యకూడదు. తాత్కాలికంగా నెప్పి అనిపించినా, ఎక్సరసైజు ఆపగానే నెప్పి తగ్గిపోవాలి. ఎక్సరసైజులు తక్కువ స్థాయిలో మొదలు పెట్టి క్రమేపీ ఎక్కువ చెయ్యాలి. అవసరాన్ని బట్టి నెప్పి మందులు తాత్కాలికంగా వాడవచ్చును. మందులు నెప్పి తగ్గటానికి మాత్రమే, జబ్బు తగ్గటానికి కాదు. ప్రత్యేకమైన పరికరాలు ఏమీ అక్కరలేదు. ఎక్సరసైజులు చెయ్యటం కష్టంగా ఉంటే ఫిజికల్ తిరపిస్ట్ సహాయం తీసుకోవచ్చును.

Treatment of neck pain: Neck pain gets better on its own in majority of cases. Treatment facilitates recovery. Treatment is mainly through exercises. Pain medication may be used temporarily to help exercise. Medication is good only for pain relief, not for healing. Exercises have to be started at a low level and then increased gradually. Avoid activities that make pain significantly worse. physical therapist will help if the patient finds it difficult to exercise. No special equipments are needed.

మెడ నెప్పి: డాక్టర్ కి ఎప్పుడు చూపించుకోవాలి?: మాములుగా వచ్చే మెడనెప్పికి డాక్టర్ కి చూపించుకోకపోయినా ఫరవాలేదు. జ్వరం, నీరసం, ఆకలి లేకపోవటం లాంటి లక్షణాలు ఉన్నా, నరాలు లేదా వెన్నుపాము నలిగినట్లు అనుమానం ఉన్నా, నెప్పి ఒకటి రెండు వారాల్లో తగ్గుముఖం పట్టకపోయినా చూపించుకోవాలి. MRI టెస్ట్ వలన ఎక్కువగా తెలిసేది ఏమీ ఉండదు. వయసు 50 దాటినా తరవాత దాదాపు అందరికి డిస్కులు అరిగి ఉంటాయి. అది జబ్బు కింద లెక్క కాదు. ఆపరేషన్ చేయించుకునే ఆలోచన ఉన్నప్పుడు MRI అవసరం. టిబి లాంటి వేరే జబ్బులని అనుమానం ఉన్నా MRI చేయించుకోవాలి. ఆపరేషన్ వలన ప్రయోజనం కొద్ది సందర్భాలలోనే ఉంటుంది. కేవలం నెప్పి కోసం ఆపరేషన్ చేయించుకోవటం అంత అంత సమర్ధనీయం కాదు.

When to see doctor for neck pain: Doctors must be consulted when there are symptoms like fever, fatigue, and appetite loss, when there is suspicion for compression of the nerves and/or spinal cord or when the pain is not trending down after 1-2 weeks. MRI scans are non-informative in most cases. After the age 50, almost every one has disk disease or neck arthritis on MRI and it is harmless. MRI is needed for surgery planning and if there is suspicion for diseases like TB. Surgery for cervical spondylosis is beneficial only in a small proportion of carefully selected cases.


సంప్రదించండి / Contact