బాల కె దావులూరి, ఎండి

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ

ఆయుష్ హాస్పిటల్ ఏలూరు

Bala K Davuluri, MD

American Board of Neurology

Aayush Hospital Eluru

ఫిట్స్, ఎపిలెప్సీ

Seizures,Epilepsy

ఫిట్స్ జబ్బు: ఒక సూక్ష్మావలోకనం: ఫిట్స్ (seizures) అంటే ఏమిటి? ఫిట్స్ కి ఎపిలెప్సీకి తేడా ఏమిటి? ఫిట్స్ లో ప్రధానమైన రకాలు ఏమిటి? EEG టెస్ట్ వలన ఏం తెలుస్తుంది? ఎపిలెప్సీ మందులు ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా ఎన్నుకోవాలి?, ఎపిలెప్సీ మందులు పనిచెయ్యనప్పుడు ఏంచెయ్యాలి? స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఏమిటి? ఫిట్స్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

A simple overview of seizures and epilepsy: What are seizures? What is the difference between seizures and epilepsy? What are the main types of seizures and how to recognize them? What does EEG reveal? Why use antiepilepsy medications? When to use them? How to choose them? What to do when medications fail to work? What is status and epilepticus? What is first aid for seizures?

ఫిట్స్ లో రకాలు: బిగుసుకుపోయి కొట్టుకునే ఫిట్స్: బిగుసుకుపోయి కొట్టుకునే ఫిట్లు భయం గొలిపే లాగా ఉంటాయి. రిస్కులు కూడా ఎక్కువే. ఇవి మెదడంతా ఒకేసారి మొదలు కావచ్చును, లేదా మెదడులో ఒక భాగంలో మొదలయ్యి మిగతా భాగాలన్నిటికీ వ్యాపించవచ్చును. ఏ రకమైనవి అని నిర్ధారించడానికి న్యూరాలజిస్ట్ ప్రయత్నం చెయ్యాలి. చికిత్స దాన్ని బట్టి ఉంటుంది. ఒకోసారి బిగుసుకుపోయి కొట్టుకునే ఫిట్లు మరింత ప్రమాదమైన స్టేటస్ ఎపిలెప్టికస్ గా మారవచ్చును

Generalized Tonic Clonic (Grandmal) Seizures: These are the most common and troublesome seizures. The entire brain is affected. They may start in the entire brain (primary generalized) at a time or start in one part of the brain and then become generalized (secondary generalized). Treatment may differ with the type. Sometimes they can lead to a dangerous condition called status epilepticus.


ఫిట్స్ లో రకాలు: కాంప్లెక్స్ పార్షియల్ ఫిట్స్. మెలకువగా ఉన్నా తెలివి ఉండదు: కాంప్లెక్స్ పార్షియల్ ఫిట్స్ వచ్చిన వాళ్ళు మెలుకువగానే ఉన్నట్లు ఉంటారుగానీ తెలివి ఉండదు. ఫిట్ ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతుంది కానీ తరవాత అయోమయం చాలా సేపు ఉంటుంది. ఇవి ఒకోసారి మరింత ప్రమాదమైన బిగుసుకుపోయి కొట్టుకునే ఫిట్స్ గా మారవచ్చును. మళ్ళి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ. అంటే ఎపిలెప్సీ ఉన్నట్లు లెక్క. మందులు వాడాలి. మందులు పనిచేయనప్పుడు ఆపరేషన్ వలన మేలు జరగవచ్చును.

Complex partial seizures: These cause loss awareness for less than 2 minutes. The patient appears awake but remains unresponsive. The seizure may be followed by confusion that may last for several minutes. Sometimes they can transform into more troublesome generalized tonic clonic seizures

ఫిట్స్ లో రకాలు: నిద్రలో వచ్చే అరుదయిన ఫిట్స్: హైపర్కినెటిక్ ఫిట్లు మెదడులో ఫ్రంటల్ లోబ్ అనే భాగంలో జబ్బు వలన వస్తాయి. ఎక్కువగా నిద్రలో వస్తాయి. ఒక రాత్రిలో అనేక సార్లు రావచ్చును. టెస్టులన్నీ నార్మల్ గా రావచ్చును. వీటిని గుర్తించడం న్యూరాలజిస్టులకు కూడా ఒకోసారి కష్టం కావచ్చును. ఈ ఫిట్లు వచ్చిన వాళ్ళు విపరీతమైన చేష్టలు చేస్తారు. ఇవి ఒకోసారి ఇవి మరింత బిగుసుకుపోయి కొట్టుకునే ఫిట్స్ గా మారవచ్చును

A rare type of peculiar seizures that occur frequently in sleep: Hyperkinetic/Frontal lobe seizures occur mostly in sleep, often multiple times in a single night. They can be difficult to recognize even for neurologists. Patient exhibit unusual behaviors with excessive movements and sometimes shouting. Sometimes they can transform into more troublesome generalized tonic clonic seizures

ఫిట్స్ లో రకాలు: ఆబ్సెన్స్ ఫిట్స్: మెలుకువగానే ఉంటుంది. తెలివి ఉండదు.అబ్సెన్స్ ఫిట్స్ పిల్లలికి వస్తాయి. మెలుకువగానే ఉంటారు కానీ తెలివి ఉండదు. 20-30 సెకండ్లు మాత్రమే ఉంటాయి. వెంటనే తెలివి పూర్తిగా వచ్చేస్తుంది. అనేకసార్లు రావటం వలన పిల్లలు చదువులో వెనకబడవచ్చును..

Absence seizures: These occur in childhood. The child appears conscious but looses awareness. The seizure lasts 20-30 seconds. The child snaps back to normal after the seizure. The seizures can occur many times in the day and impair learning in school.


ఫిట్స్ లో రకాలు: చంటి పిల్లలకు వచ్చే ఒక చెడ్డ ఫిట్స్ జబ్బు:

ఇన్ఫన్టైల్ స్పాజమ్స్ చంటిపిల్లలకు వచ్చే ఒక అరుదైన ఫిట్స్ జబ్బు. ఈ పిల్లలు బుద్ధిమాంద్యంతో పుట్టవచ్చును లేదా ఈ ఫిట్స్ వల్ల బుద్ధిమాంద్యం రావచ్చును. ప్రధమ దశలో గుర్తించి చికిత్స మొదలుపెడితే ఒకోసారి బుద్ధిమాంద్యం రాకుండా కాపాడుకోవచ్చును

Infantile spasms: This is a rare type of bad epilepsy that affects babies. These babies may be born with intellectual disability or they may develop intellectual disability because of seizures. Sometimes it is possible to prevent intellectual disability if these seizures are recognized and treated. early.

ఫిట్స్ లో రకాలు: చాలా అరుదుగా కనిపించే ఫిట్స్: అరుదుగా, ఫిట్స్ విచిత్రమైన లక్షణాలతో రావచ్చును. అవి ఫిట్స్ అని గుర్తించడం కష్టం కావచ్చును. లక్షణాలు ఎలాగైనా ఉండవచ్చును. ఐతే అవి ఎప్పుడూ ఒకే లాగా ఉంటాయి. కొద్దిసేపే ఉంటాయి

Rare types of seizures: Rarely seizures can come some very peculiar and unusual symptoms. They can be difficult to recognize. The clinching features are the stereotypical nature and the short duration

ఫిట్స్ లో రకాలు: చంటి బిడ్డ గుణం: Febrile seizures ని మన పెద్దవాళ్లు చంటిబిడ్డ గుణం అనేవారు. ఇవి కొంతమంది చంటిపిల్లలకు జ్వరం తో పాటు వస్తాయి. సాధారణంగా వయసు పెరిగితే పోతాయి. చూడటానికి భయంగొలిపే లాగా ఉన్నా ఇవి అంత ప్రమాదమైనవి కాదు కానీ డాక్టర్కి చూపించుకోవాలి. అనవసర చర్యలు (ఉ: ఫిట్ ఉన్నప్పుడు నోట్లో ఏదయినా పొయ్యటం లాంటివి) ఏమీ చెయ్యకూడదు.

Febrile Seizures: Some babies get seizures with fever. These are called febrile seizures. They are scary to look at but usually not dangerous. They will go away as the child grows. Sometime they may be difficult to differentiate from the more troublesome seizure disorders. Consult doctor.


సంప్రదించండి / Contact