బాల కె దావులూరి, ఎండి

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ

ఆయుష్ హాస్పిటల్ ఏలూరు

Bala K Davuluri, MD

American Board of Neurology

Aayush Hospital Eluru

స్ట్రోక్

Stroke

అథెరోస్క్లెరోసిస్, రక్తనాళాల్లో కొవ్వుపేరుకోవటం: అథెరోస్క్లెరోసిస్ వలన రక్తనాళాలు పూడుకుపోతాయి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, గాంగ్రీన్ లాంటి ప్రమాదమైన జబ్బులు రావచ్చును. ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?, ఎలావస్తుంది? నివారణ ఎలా? చికిత్స ఎలా? స్టెంట్లు, బైపాస్ ల వలన ఎంతవరకు ఉపయోగం?

Atherosclerosis, clogging of arteries with fat: Atherosclerosis is a disease of the pipes (arteries) that carry blood. It can cause multiple problems including strokes, heart attacks, gangrene and kidney failure. Why and how people get it? How to prevent it? How to treat it? Are recanalization procedures like stents and bypasses beneficial?

స్ట్రోక్ అంటే ఏమిటి? అందులో రకాలు: స్ట్రోక్ అంటే రక్తప్రసరణ ఆగిపోవటం వలన మెదడు దెబ్బతినటం. ఇది రక్తనాళాలు పూడుకుపోవటం వలన జరగవచ్చును. రక్త నాళాలు చిట్లటం వలన జరగవచ్చును. స్ట్రోక్ లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి, నెమ్మదిగా ఎంతోకొంత తగ్గుతాయి. ఒకోసారి లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చును (సైలెంట్ స్ట్రోక్).ఒకోసారి ప్రాణం పోవచ్చును (మాలిగ్నెంట్ స్ట్రోక్). ఒకోసారి లక్షణాలు కొద్దిసేపే ఉండవచ్చును (మిని స్ట్రోక్). ఏ స్ట్రోక్ ఐనా, ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్లకు అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కారణం కనిపెట్టి నివారణ చర్యలు చేపట్టాలి.

Types of Stroke: Stroke is damage to brain due to loss of blood supply. It can happen because of occlusion of blood carrying pipes (ischemic stroke) or rupture of blood carrying pipes (hemorrhagic stroke). Stroke symptoms start abruptly and then improve slowly to some extent. Sometimes stroke may not have any symptoms (silent stroke). Sometimes stroke can kill (malignant stroke). Sometimes stroke symptoms last only for a short time (ministroke). Stroke has a high recurrence rate. It is important to find the cause and then take preventive measures.


స్ట్రోక్ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? స్ట్రోక్ రావటానికి అథెరోస్క్లెరోసిస్ ఒక ప్రధాన కారణం. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండవచ్చును. వీటిలో ఒకటి ఏట్రియల్ ఫైబ్రిల్లేషన్. ఏట్రియల్ ఫైబ్రిల్లేషన్ ఉన్నవాళ్లకు గుండె లయబద్ధంగా కొట్టుకోదు. గుండెలో ప్రవాహం మందగించి రక్తం గడ్డ కడుతుంది. రక్తం గడ్డ ముక్కలు మెదడుకి చేరుకొని స్ట్రోక్ ని కలిగిస్తాయి. స్ట్రోక్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది పరీక్షల చేసి తెలుసుకోవటం మంచిది. కారణాన్ని బట్టి నివారణ ఉంటుంది.

Why and how of stroke: Atherosclerosis is an important cause of stroke, but there can be other causes. Among them is atrial fibrillation which is irregular heart beat. With irregular heart beat, clots form in the heart because of sluggish blood flow. Pieces of clot can get loose, travel to the brain and cause stroke. Knowing the cause of the stroke helps prevention.

స్ట్రోక్ లక్షణాలు: మెదడులో దెబ్బతిన్న భాగాన్ని బట్టి ఉంటాయి. పక్షవాతం అంటే శరీరంలో ఒక పక్క నీరసించడం, లేదా తిమ్మిరెక్కడం, మూతి వంకర, దృష్టిలోపాలు, మాటపడిపోవటం, కళ్ళు తిరగటం, నడవలేకపోవటం, లాంటివి లక్షణాలు స్ట్రోక్ కావచ్చును. లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి. నెమ్మదిగా ఎంతోకొంత తగ్గుతాయి. రెండు చేతులు ఒకేసారి బలహీనమైతే, అది స్ట్రోక్ కాదు. స్పృహ తప్పటం కూడా సాధారణంగా స్ట్రోక్ లక్షణం కాదు.Stroke Symptoms:

Stroke Symptoms: Stroke symptoms depend on the part of the brain that is damaged. Symptoms may include paralysis or numbness on one side of the body, not paying attention to the left side of the body, facial droop, vision loss, speech difficulty, limp or inability to walk, dizziness, and spinning sensation. Symptoms always start abruptly and then slowly improve to some extent. Stroke does not cause weakness in both arms simultaneously. It is unusual for stroke to cause loss of consciousness,


స్ట్రోక్ తక్షణ చికిత్స: 80 శాతం కేసుల్లో స్ట్రోక్ మెదడులో రక్తం గడ్డలవలన వస్తుంది. ఈ రక్తం గడ్డలను కరిగించే మందులు లేదా పరికరాలు ద్వారా తొలగించే ప్రక్రియలు ఉన్నాయి, కానీ అనుకున్నంత గొప్పగా పని చేయవు.

1. ఈ చికిత్సలకు ఖర్చు ఎక్కువ. పెద్ద నగరాల్లోనే ఈ చికిత్స లభిస్తుంది.

2. లక్షణాలను మొదలైన కొద్ది గంటలలోనే రోగిని హాస్పిటల్ కి తీసికొని వెళ్లగలిగి ఉండాలి.

3. స్ట్రోక్ వచ్చిన వాళ్లందరికీ ఈ చికిత్సలు చెయ్యటం వీలు కాదు. జాగ్రత్తగా ఎన్నుకున్న కొన్ని కేసుల్లోనే వీలవుతుంది.

4. చికిత్సలో కొంత రిస్క్ ఉంటుంది. మెదడులో రక్త స్రావం కావచ్చు. ప్రాణాపాయం రావచ్చు. కేసులు సరిగా ఎన్నుకోపోతే ఈ రిస్క్ ఇంకా ఎక్కువ.

5. ఈ చికిత్సల వలన 10 నుండి 25 శాతం కేసుల్లోనే మేలు జరుగుతుంది. 1 నుండి 2 శాతం కేసుల్లో హాని జరగవచ్చును.

Emergency treatment of stroke: 80% of strokes are caused by blood clots in brain. There are medications that can dissolve the clots and procedures to remove clots. These treatments are expensive and available only in big hospitals. The treatments benefit only 10 to 25% of patients that are carefully selected. They can cause harm and death in 1-2% of cases. Great care must be taken in selecting cases for these treatments.

స్ట్రోక్ వచ్చిన తరవాత చేపట్టవలసిన చర్యలు, చికిత్సలు: శరీరం తనంత తాను సహజంగా రిపేర్ చేసుకొంటుంది. ఇది జరగటానికి అవసరాన్నిబట్టి కొన్ని చికిత్సలు అవసరం కావచ్చును. అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించి బీపీ పడిపోకుండా చూసుకోవాలి. మింగలేకపోతే అవసరాన్నిబట్టి గొట్టం ద్వారా ఆహారాన్ని అందించాలి. మింగినప్పుడు ఆహారం ఉపిరితిత్తులలోనికి పోయి న్యూమోనియా రాకుండా చూసుకోవాలి. డయాబెటిస్ ఉంటె సరిగా అదుపులో పెట్టుకోవాలి. శరీరాన్ని కదిలించాలి. వ్యాయామం మొదలు పెట్టాలి. కదలిక లేనందువలన చచ్చు బడిన అవయవాల్లో రక్తం గడ్డలు కట్టి, అవి ఉపిరితిత్తులలోనికి పోయి ప్రాణాపాయం కలగవచ్చును. ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. జరిగితే వెంటనే చికిత్స చేసుకోవాలి. స్ట్రోక్ మళ్ళీ రాకుండా చర్యలు చేపట్టాలి.

Non-emergency treatment of stroke: Stroke heals by itself, through body's self repair mechanisms. Sometimes supportive treatments are needed. May need saline to support the blood pressure, may need precautions to prevent pneumonia, may need feeding tube, may need good diabetes control, may need precautions to prevent infection. All stroke patients need early physical therapy and measures to prevent another stroke. Sometimes clots form in paralyzed limbs, travel to lungs and threaten life. This needs to be prevented and treated.


స్ట్రోక్ ఫిజికల్ థెరపీ: స్ట్రోక్ కోలుకోవడానికి సాధన అంటే వ్యాయామం, ఫిజికల్ థెరపీ తోడ్పడతాయి. కండరాలను బలపరచుకోవాలి. కీళ్లు తోడుకుపోకుండా చర్యలు తీసుకోవాలి. పేషెంటుకి సురక్షితమైన పద్దతిలో మింగటం నేర్పించాలి. పడిపోకుండా జాగ్రత్తలతో నడక సాధన చెయ్యాలి. వ్యాయామం, ఫిజికల్ థెరపీ కొన్నాళ్ళు చేసి మానేసేది కాదు, స్నానం, దంతధావనం లాగా ఎల్లప్పుడు చేసుకోవాలి. ఇంట్లోనే చేసుకోవచ్చును.

Therapy for stroke: Stroke recovery occurs by body's natural healing mechanisms but is facilitated by exercises and physical therapy. Patient needs exercises to strengthen muscle and to prevent joint deformities. Patient needs to be taught safe swallowing methods to prevent aspiration pneumonia. Patient needs to practice walking with due fall precautions in place. Physical therapy, like bathing and brushing teeth, is a lifelong culture. It can be done at home by the patient himself with help from family members.

సంప్రదించండి / Contact